యాప్నగరం

సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్

ముప్పేట దాడి మొదలవడంతో టీటీవీ దినకరన్ దిగొచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉంటానని వెల్లడించారు.

TNN 19 Apr 2017, 2:05 pm
ముప్పేట దాడి మొదలవడంతో టీటీవీ దినకరన్ దిగొచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉంటానని వెల్లడించారు. పార్టీ నుంచి తప్పుకునేందుకు తనకేలాంటి బాధలేదని, పార్టీ ఐక్యంగా ఉండాలనే తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.
Samayam Telugu dinakaran says he is stepping aside from party
సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్


‘నా బలం నిరూపించుకోవడానికి విశ్వాస పరీక్షకు సిద్ధంగా లేను. పార్టీ బలహీన పడటానికి నేను కారణం కాబోను. అందరూ ఐక్యమత్యంగానే ఉండాలని కోరుకుంటున్నానని’ దినకరన్ బుధవారం మీడియాతో చెప్పారు.

అయితే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోనని, అలాంటి పరిస్థితే వస్తే తనకు ఆ పదవికి కట్టబెట్టిన శశికళను కలిసే నిర్ణయం తీసుకుంటానని దినకరన్ పేర్కొన్నారు.
శశికళతో పాటు దినకరన్ లను పార్టీకి దూరంగా పెడతామని ఆర్థికమంత్రి డి.జయకుమార్ మంగళవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిందే.

అటు రద్దయిన ఆర్కె నగర్ ఉప ఎన్నికలో పార్టీ రెండాకుల గుర్తు తాను దక్కించుకోవడానికి ఎన్నికల సంఘానికి రూ.50కోట్లు లంచం ఇవ్వజూపాడని దినకరన్ పై కేసు నమోదైంది. దీంతో పాటు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.