యాప్నగరం

టీటీవీ దినకరన్‌కు ఐదు రోజుల కస్టడీ

ఎన్నికల సంఘానికి రూ.50 కోట్ల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న కేసులో మంగళవారం అరెస్టయిన అన్నాడీఎంకే

TNN 26 Apr 2017, 6:01 pm
ఎన్నికల సంఘానికి రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న కేసులో మంగళవారం అరెస్టయిన అన్నాడీఎంకే (అమ్మ) నేత టీటీవీ దినకరన్ కు ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. దినకరన్ పై నమోదైన కేసుపై పోలీసులు, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి పూనమ్ చౌదరి ఆయనకు మే 1 దాకా కస్టడీ విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు.
Samayam Telugu dinakaran taken into five days custody in a bribery case
టీటీవీ దినకరన్‌కు ఐదు రోజుల కస్టడీ


దినకరన్ తో పాటు అతని స్నేహితుడు మల్లికార్జున్ కు కూడా కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీ విధించింది. దినకరన్ కేసు విచారణ జరిగే సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు.

దినకరన్ ను ప్రశ్నించేందుకు వారం రోజుల సమయం కావాలని పోలీసులు కోరగా కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. దినకరన్ ను పోలీసులు విచారించడాన్ని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ఎన్నికల సంఘానికి లంచ ఇవ్వజూపాడనడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు.

ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహారించడాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ ను ఏప్రిల్ 16 న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.