యాప్నగరం

​భార్యభర్తల రాజకీయ విబేధాలు.. రాళ్లు విసురుకున్నారు!

రాజకీయం అనూహ్యంగా ఆ భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టినట్టుగా ఉంది

TNN 15 Apr 2017, 8:34 am
అబ్బే.. మా మధ్య విబేధాలు ఏమీ లేవు.. అని ఇటీవలే ప్రకటన చేశాడు మాధవన్. మొన్నటి వరకూ ఈయనంటే ఎవరో తెలీదు కానీ.. జయలలిత మరణానంతరం ఆమె మేనకోడలు దీప వెలుగులోకి వచ్చాకా.. దీప భర్తగా మాధవన్ కు గుర్తింపు దక్కింది. జయ మరణానంతర పరిణామాల్లో దీప సొంతంగా పార్టీ పెట్టడంతో ఆమె వెనుక మాధవన్ ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే ఈ రాజకీయం అనూహ్యంగా ఆ భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టినట్టుగా ఉంది. ఇంతకు ముందు వీరి బంధం ఎలా ఉండేదో కానీ.. పార్టీ పెట్టాకా మాత్రం వీరిద్దరి మధ్య విబేధాలు రచ్చకు ఎక్కాయి.
Samayam Telugu disputes between deepa and madhavan
​భార్యభర్తల రాజకీయ విబేధాలు.. రాళ్లు విసురుకున్నారు!


ఒక దశలో దీపను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు మాధవన్. తను చెప్పిన వారికి పార్టీలో పదవులు ఇవ్వలేదనేది ఆయన ఆగ్రహానికి కారణమట. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు వీరిద్దరూ మళ్లీ కలిశారు. అయితే.. నామినేషన్ పత్రాల్లో దీప భర్త పేరు కాలమ్ ను ఖాళీగా ఉంచిందనే ప్రచారం మాధవన్ ను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆయన మళ్లీ ఆగ్రహోద్రిక్తుడు అయ్యాడంటారు.

ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన మాధవన్.. దీపతో తనకు విబేధాలు ఏమీ లేవని ప్రకటన చేశాడు. తామిద్దరం ఒకటే అన్నాడు. అయితే తాజాగా అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దీప, ఆమె భర్త వర్గాలుగా విడిపోయి గొడవ పడ్డారు. దీప ఇంటి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరి అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. రాళ్లు రువ్వుకునేంత వరకూ వెళ్లింది వ్యవహారం. చివరకు ఈ భార్యభర్తల రాజకీయ విబేధాలతో రేగిన ఈ రచ్చను పోలీసులు వచ్చి సద్దుమణిగేలా చేశారు. మరి రాజకీయంగా సంచలనాలు నమోదు చేయడం ఏమో కానీ.. రాజకీయాల్లోకి రావడం దీప ఇంట్లో తీవ్రమైన కలతలే రేపినట్టుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.