యాప్నగరం

రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు ప్రారంభించిన డీఎంకే

పళనిసామి ప్రభుత్వం మరోసారి బలనిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష డీఎంకే తమిళనాడు వ్యాప్తంగా బుధవారం

Samayam Telugu 22 Feb 2017, 10:43 am
పళనిసామి ప్రభుత్వం మరోసారి బలనిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష డీఎంకే తమిళనాడు వ్యాప్తంగా బుధవారం నిరసన దీక్షలు చేపట్టింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తిరుచ్చిలో దీక్ష ప్రారంభించారు.
Samayam Telugu dmk launches day long fast seeking fresh trust vote against palanisamy
రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు ప్రారంభించిన డీఎంకే


డిఎంకే చేపట్టిన ఈ దీక్షకు కాంగ్రెస్, ముస్లింలీగ్ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

ఈనెల 18న అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా గందరగోళం నెలకొంది. రహస్య ఓటింగ్ జరపాలని డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్, ఓ పన్నీరు వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డీఎంకే సభ్యులు సభలో హల్ చల్ చేశారు. దీంతో డీఎంకే సభ్యులను సభ నుంచి బహిష్కరించి స్పీకర్ బహిరంగ ఓటింగ్ జరిపారు.

ప్రధాన ప్రతిపక్షం లేకుండా విశ్వాస పరీక్ష జరపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని...మళ్ళీ బలనిరూపణ జరపాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై తాము గురువారం రాష్ట్రపతిని కలుస్తామని స్టాలిన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.