యాప్నగరం

ఢిల్లీలో స్కల్ ప్రొటెస్ట్‌కి మద్దతు పలికిన కనిమొళి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు చేపడుతున్న స్కల్ ప్రొటెస్ట్ నిరసన దీక్షకి మద్దతు పలికిన వారి...

Times Now 31 Mar 2017, 2:06 pm
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు చేపడుతున్న స్కల్ ప్రొటెస్ట్ నిరసన దీక్షకి మద్దతు పలికిన వారి జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వంటి వాళ్ల తర్వాత తాజాగా డీఎంకే నేత కనిమొళి కూడా చేరారు. గత 15 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన తమిళనాడు రైతులు తమ రుణాలు మాఫీ చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి ఆందోళనకి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన అయితే కనిపించలేదు కానీ నేతలు మాత్రం వీరి దీక్షా శిబిరానికి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు.
Samayam Telugu dmk mp kanimozhi joins skull protest at jantar mantar in delhi
ఢిల్లీలో స్కల్ ప్రొటెస్ట్‌కి మద్దతు పలికిన కనిమొళి

DMK's Kanimozhi has joined the #SkullProtest in New Delhi. #WATCH report pic.twitter.com/1vQi0KVokl— TIMES NOW (@TimesNow) March 31, 2017
మొదట తమిళనాడు సినీపరిశ్రమ తరపున తమ మద్దతు తెలియజేస్తూ విశాల్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు ఢిల్లీ వెళ్లి వీరికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిసి రైతులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ విశాల్, ప్రకాశ్ రాజ్ మంత్రికి ఓ వినతిపత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత తాజాగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా రైతులు చేపట్టిన ఈ దీక్షకి తమ మద్దతు తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.