యాప్నగరం

రూ.2వేలు దాటితే నగదు రూపంలో ఇవ్వొద్దు: ఐటీ

అక్రమ నగదు లావాదేవీలను అరికట్టడానికి ఆదాయపన్ను శాఖ మరో అడుగు ముందుకేసింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కన్నేసింది.

TNN 23 Jan 2018, 4:46 pm
అక్రమ నగదు లావాదేవీలను అరికట్టడానికి ఆదాయపన్ను శాఖ మరో అడుగు ముందుకేసింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కన్నేసింది. రాజకీయ పార్టీలకు రూ.2వేల కంటే ఎక్కువ విరాళాలను నగదు రూపంలో ఇవ్వొద్దని దేశ ప్రజలకు ఐటీ శాఖ సూచించింది. ఈ మేరకు ఐటీ శాఖ శనివారం నుంచి ప్రకటనలను ప్రారంభించింది. ఎన్నికల నిధుల్లో అక్రమాలను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ‘ఎలక్టోరల్ బాండ్స్’ను తీసుకొచ్చింది. వీటిని ఎంపికచేసిన ఎస్బీఐ బ్రాంచ్‌లను కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఈ బాండ్ల ద్వారా డబ్బులను రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వొచ్చు.
Samayam Telugu do not donate over rs 2000 in cash to political parties i t department
రూ.2వేలు దాటితే నగదు రూపంలో ఇవ్వొద్దు: ఐటీ


ఈ పథకం ప్రకారం, ఒక వ్యక్తి రూ.2వేలకు మించి నగదు రూపంలో రాజకీయ పార్టీలకు గానీ, ట్రస్టులకు గానీ విరాళం ఇవ్వకూడదు. ఈ మేరకు ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో ఆదాయపన్ను శాఖ ప్రకటనలు జారీ చేసింది. రాజకీయ విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గానీ ఈ విధంగా ప్రజా సలహాను జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రకటనలోనే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పథకం గురించి కూడా ఐటీ శాఖ ప్రస్తావించింది. దీనితో పాటు మరిన్ని నగదు లావాదేవీల గురించి ఐటీ శాఖ సూచనలిచ్చింది.

ఓ వ్యక్తి నుంచి ఒక్క రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును తీసుకోవద్దని ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని ఒక్క రోజులో కొంచెం కొంచెంగా కూడా తీసుకోవద్దంది. స్థిరాస్తులకు సంబంధించి రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోవడం కానీ, చెల్లించడం కానీ చేయకూడదని వెల్లడించింది. వ్యాపారం లేదా వృత్తి పరమైన ఖర్చులకు సంబంధించిన లావాదేవీలు రూ.10వేలకు మించి నగదు రూపంలో జరగకూదని సూచించింది. పైన తెలిపిన అన్ని పరిస్థితుల్లో ప్రజలు నగదు లావాదేవీలను తిరస్కరించాలని ఐటీ శాఖ పిలుపునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.