యాప్నగరం

తమిళనాడు పోలీసులకు పన్నీరుసెల్వం లేఖ

తమిళనాడు పోలీసులు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ లేఖను రాశారు.

TNN 17 Feb 2017, 6:14 pm
తమిళనాడు పోలీసులు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ లేఖను రాశారు. ఆ లేఖలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయొద్దని కోరారు. వారంతా అమ్మ మద్దతుదారులని చెప్పుకున్నారు. పన్నీర్ సెల్వం గురువారం రాత్రి జయలలిత సమాధి వద్దకు వెళ్లి శపథం చేశారు. శశికళ కనుసన్నల్లో ఏర్పడిన పళనిస్వామి ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేస్తానని ఈ సందర్భంగా శపథం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరి బలవంతంతో కాకుండా తన ఇష్టం మేరకు ఓటు వేసేలా చూడాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆందోళన నిర్వహించే మద్దతుదారులను అరెస్టు చేయవద్దని ఆయన పోలీసులను కోరారు.
Samayam Telugu dont arrest ammas supporters ops to police
తమిళనాడు పోలీసులకు పన్నీరుసెల్వం లేఖ


పన్నీర్ సెల్వం శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు. పళని స్వామి శనివారం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు పరోక్షంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.