యాప్నగరం

ఉప్పు కొరత లేదు.. ఎవరూ చింతించకండి

నోట్ల రద్దుతో కిలో ఉప్పును రూ.250 దాకా అమ్ముతున్నారనే పుకార్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో షికార్లు చేస్తున్నాయి. చాలా దుకాణాల్లో రద్దీ నెలకొంది. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉప్పు కొంటుండటంతో దుకాణదారులు బెంబేలెత్తిపోతున్నారు.

TNN 12 Nov 2016, 12:06 am
నోట్ల రద్దుతో కిలో ఉప్పును రూ.250 దాకా అమ్ముతున్నారనే పుకార్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో షికార్లు చేస్తున్నాయి. చాలా దుకాణాల్లో రద్దీ నెలకొంది. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉప్పు కొంటుండటంతో దుకాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు వ్యాపారులు దుకాణాలు కూడా మూసివేసుకున్నారు. ఈ పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం పేర్కొంది. కానీ ప్రజలు మాత్రం ఆందోళన చెందుతునే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణంలో కిలో ఉప్పు రూ.250లకు అమ్ముతున్నారనే వార్తలు వినిపించడంతో ఆ రాష్ట్రంలో ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలు భయాందోళనల్లో మునిగిపోయారు.
Samayam Telugu dont panic there is no shortage of salt in the country says government
ఉప్పు కొరత లేదు.. ఎవరూ చింతించకండి


వార్తలపై స్పందించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సత్యేంద్ర సింగ్ పుకార్లను కొట్టిపారేశారు. ఉప్పుకు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. పుకార్లు సృష్టించిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. పుకార్లను పట్టించుకోవద్దని లక్నో ఐజీ ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో నోట్ల రద్దు నిర్ణయం వల్లే ఇలా జరుగుతుందంటూ కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. ప్రజలు పుకార్లు పట్టించుకోవద్దని కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.