యాప్నగరం

కర్ణాటకలో డ్రగ్స్ చాక్లెట్ల కలకలం.. అధికారుల తనిఖీలు

విద్యార్థులు తరచుగా లిప్‌స్టిక్ చాక్లెట్స్ కొనుక్కుని తినడంతో అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. పర్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Samayam Telugu 6 Nov 2018, 3:19 pm
చాకెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయించడం కర్ణాటకలోని కసర్‌గో‌డ్‌లో కలకలం రేపుతోంది. కొడంగోడు ప్రభుత్వ ఫిషరీస్ ఉన్నత పాఠశాల సమీపంలోని దుకాణాలలో విద్యార్థులు తరచుగా లిప్‌స్టిక్స్ చాక్లెట్స్ కొనుక్కుని తినడంతో అధికారులకు అనుమానం వచ్చింది. గత కొన్ని రోజులుగా దీనిపై నిఘా పెట్టిన ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Samayam Telugu Drug chocolates


షాపులలో ఉన్న చాక్లెట్స్, లిప్‌స్టిక్స్‌ను పరీక్షించేందుకే తీసుకెళ్లారు. ఈ డ్రగ్ చాక్లెట్స్ తిన్న విద్యార్థులు గత కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. మరోసారి ఇలాంటి డ్రగ్ చాక్లెట్లు విక్రయించినట్లు గుర్తిస్తే షాపు పర్మిషన్ రద్దు చేయడంతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చెరువత్తూరు హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ లిప్‌స్టిక్ రూపంలో విక్రియస్తున్న డ్రగ్ చాక్లెట్లు తింటే వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. డ్రగ్స్ చాక్లెట్లపై విద్యార్తులకు అవగాహనా కల్పించి వారిని ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
Read this story in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.