యాప్నగరం

దుర్గా మాతా ఆశీస్సులతోనే ఇవాళ బయటపడ్డా: జేపీ నడ్డా

Kolkata: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొంత మంది ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 11 Dec 2020, 3:35 pm
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దుర్గా మాతా ఆశీస్సులతోనే తాను ఇవాళ బయట పడ్డానని ఘటన అనంతరం జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఆయన దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి
Stones hurled at JP Nadda's convoy, Vijayvargiya's vehicle ransacked


జేపీ నడ్డా వస్తున్నారనే సమాచారం తెలుసుకొని గురువారం (డిసెంబర్ 10) ఉదయం రహదారిని దిగ్బంధించిన కొంత మంది ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అనంతరం వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వీడియో: జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగాల్ బీజేపీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

తీవ్రమైన లోపాలు.. పోలీసులు అడ్డుకోలేదు: బెంగాల్ బీజేపీ చీఫ్
జేపీ నడ్డా పర్యటనలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని దిలీప్ ఘోష్ ఆరోపించారు. హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నడ్డా కార్యక్రమాల్లో ఎక్కడా పోలీసులు లేరని తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని.. పైగా వారు నడ్డా వాహనానికి అత్యంత సమీపంలోకి వచ్చేంత వరకు వేచి చూశారని ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు.


Must Read: వందేళ్ల సంబరంగా నూతన పార్లమెంట్.. ప్రత్యేకతలివే

Also Read: ప్రియుడి కోసం భారత్ వచ్చేసిన బంగ్లాదేశ్ యువతి.. చివరికి ట్విస్ట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.