యాప్నగరం

బెంగళూరులో కంపించిన భూమి.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం

కర్ణాటకలో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం ఒక్కసారిగా భూమి కదలడంతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. ఏమవుతుందోననే ఆందోళనకు గురయ్యారు.

Samayam Telugu 22 Dec 2021, 10:33 am

ప్రధానాంశాలు:


  • కర్ణాటకలో భూ ప్రకంపనలు
  • రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రత
  • 23 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రస్థానం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భూకంపం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భూమి కంపించింది. బెంగళూరుకు ఈశాన్య దిశలో రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల 9 నిమిషాల సమయంలో తొలి ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 11 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
కాగా కాసేపటికే 7 గంటల 14 నిమిషాల సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి. బెంగళూరుకు 66 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 23 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్ర స్థానం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలు‌పై 3.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఉదయాన్నే భూప్రకంపనలను గమనించిన బెంగళూరువాసులు.. ఉలిక్కి పడ్డారు. చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.