యాప్నగరం

హరియాణాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు.. న్యూ ఇయర్ వేడుకల మధ్యలోనే..

Earthquake: న్యూ ఇయర్ వేడుకల్లో దేశ రాజధాని ప్రజలు మునిగితేలుతున్నారు. పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికి ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని పరిణామాం ఎదురైంది. ఉన్నట్లుండి భూమి కంపించటంతో భయాందోళనలకు గురయ్యారు. ఏం జరగుతుందో తెలియక సెలబ్రేషన్స్ ఎక్కడిక్కడే ఆపేసి బయటకు పరుగులు తీశారు. హరియాణాలో చోటు చేసుకున్న భూకంపంతో ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో హరియాణాతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 1 Jan 2023, 9:13 am

ప్రధానాంశాలు:

  • హరియాణా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదు
  • భయాందోళనలకు గురైన ప్రజలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Earthquake
హరియాణాలో భూకంపం
Earthquake: ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన హరియాణాతో పాటు వేళ దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు భయాందోళనలకు గురి చేశాయి. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన గంట వ్యవధిలోనే భూమిలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.19 గంటలకు హరియాణాలోని ఝజ్జర్‌తో పాటు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.8గా నమోదయిందని వెల్లడించింది.
హరియాణాలోని ఝజ్జార్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్ అధికారులు గుర్తించారు. భూమి ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గతేడాది నవంబర్ 12న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. నవంబర్ 12న నేపాల్‌లో భూ ఉపరితలానికి 10 కి.మీ లోతున భూమి కంపించిందని చెప్పారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.4గా నమోదైనట్లు వెల్లడించారు. దాని ప్రభావం ఢిల్లీ పరిసర ప్రాంతాలపై పడిందని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరూ ఎంజాయ్ చేస్తూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకగా.. ఢిల్లీ, హరియాణా వాసులు మాత్రం భూకంపంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.