యాప్నగరం

బడ్జెట్ వాయిదాపై వివరణ కోరిన ఎన్నికల సంఘం

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటర్లపై తీవ్రంగా ప్రభావం

Samayam Telugu 7 Jan 2017, 12:07 pm
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటర్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి...యూపీ ఎన్నికల అనంతరం బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని నేతలు ఈసీని కోరారు. దీంతో ఎన్నికల సంఘం కేంద్ర కేబినేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాకు లేఖ రాసింది.
Samayam Telugu ec seeks reply from centre on budget delay demand
బడ్జెట్ వాయిదాపై వివరణ కోరిన ఎన్నికల సంఘం


యూపీ పోలింగ్ ముగిసే మార్చి 8న తర్వాత (వాయిదా వేసుకోవడం) బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కేంద్రం తన అభిప్రాయం తెలియజేయాలని ఈసీ ప్రదీప్ ను లేఖలో కోరింది.

ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెడితే..ఆ ప్రభావం ఓటర్లపై చూపుతుందని కాంగ్రెస్, బీఎస్పీ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు నిన్న ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ నసీం జైదీని కలిసి ఫిర్యాదు చేశారు.

ప్రతిపక్ష నేతలు కలిసి తనను కలిసిన మరుసటి రోజే ఈసీ కేంద్రానికి లేఖ రాసింది.

బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ మార్చి 8 తర్వాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా...టీఎంసీ సైతం అదే డిమాండ్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.