యాప్నగరం

గుజరాత్ ఎన్నికలు: రాహుల్‌కు మరో చుక్కెదురు!

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకీ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి మరోసారి చుక్కెదురైంది. రాహుల్ ఇంటర్వ్యూ ప్రసారాలపై చర్య తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

TNN 13 Dec 2017, 9:28 pm
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకీ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి మరోసారి చుక్కెదురైంది. రాహుల్ ఇంటర్వ్యూ ప్రసారాలపై చర్య తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి.. వెంటనే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ప్రసారాలను నిలిపి వేయించారు. గుజరాత్‌లో గురువారం (డిసెంబర్ 14)న అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉంది. మంగళవారంతోనే ప్రచార గడువు ముగియడంతో 48 గంటల పాటు ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Samayam Telugu ec stops telecast of rahul gandhis interview orders fir against tv channels
గుజరాత్ ఎన్నికలు: రాహుల్‌కు మరో చుక్కెదురు!


అయితే.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీతో పలు టీవీ ఛానెళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించాయి. బుధవారం సాయంత్రం వీటిని టెలికాస్ట్ చేయడం ప్రారంభించాయి. గుజరాత్ రాజకీయాలే ప్రధానంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. దీంతో కొంత మంది నేతలు ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.

సదరు ఇంటర్వ్యూ అంశాన్ని పరిశీలించిన ఈసీ అది కచ్చితంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంది. తక్షణం ఆ ఇంటర్వ్యూ ప్రసారాలను నిలిపేసి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయా టీవీ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో రాహుల్‌ మరో వివాదంలో చిక్కుకోవడం గుజరాత్ పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.