యాప్నగరం

సీఎంగా పళనిసామికే అవకాశం?

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పడి పళనిసామి నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

TNN 15 Feb 2017, 5:01 pm
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పడి పళనిసామి నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ విద్యాసాగర్‌రావు వెల్లడించనున్న నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలోని 118 ఎమ్మెల్యేల మద్దతున్న పళనిసామికే సీఎం అవకాశం దక్కుతుందని రాజకీయ కోవిధులు చెపుతున్నారు.
Samayam Telugu edappadi palanisamy will be next cm for tamil nadu
సీఎంగా పళనిసామికే అవకాశం?


తనకు మద్దుతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా పళనిసామి గవర్నర్‌కు అందజేసారు. దీంతో బలనిరూపణ కోసం ఆయనకు కొంత గడువు ఇచ్చి ప్రస్తుతానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడానికే గవర్నర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా తేల్చడంతో రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ఎడప్పడి పళనిసామి తెరపైకి వచ్చారు. శశికళ మద్దతు ఎమ్మెల్యేలు ఆయన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్ సెల్వం వర్గానికి మరో కొత్త శత్రువు వచ్చినట్లయింది. ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటల ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.