యాప్నగరం

సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్

మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా శిసేవన నాయకుడు ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో వారం రోజులుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెర పడింది. బీజేపీతో కలసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 30 Jun 2022, 8:33 pm

ప్రధానాంశాలు:

  • ముగిసిన మహా రాజకీయ సంక్షోభం
  • 20వ రాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే
  • బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఇక బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. ఎన్నో మలుపులు తర్వాత షిండే సీఎం పదవిని దక్కించుకున్నారు.
రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవడానికి థాక్రే నేతృత్వంలోని శివేసనను బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ చేసిన వెంటనే షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారం రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం ఈ విధంగా ముగిసింది.

షిండే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తుందని ఫడ్నవీస్ తెలిపారు. అంతేకాదు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన తర్వాత ప్రత్యామ్నాయంగా వస్తున్న ప్రభుత్వం సజావుగా సాగేలా చూస్తానని ఫడ్నవీస్ అన్నారు. అప్పుడే షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. నిజానికి ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ప్రకటించారు. అయితే బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు అంగీకరించారని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.