యాప్నగరం

ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పట్లే.. ప్రైవేట్ స్కూల్లో చేర్పించండి.. సీఎంకు 11 ఏళ్ల బాలుడి విజ్ఞప్తి

ఓ 11 ఏళ్ల బాలుడు బీహార్ సీఎం నితిష్ కుమార్‌కు షాక్ ఇచ్చాడు. కళ్యాణ్‌బిఘలో పర్యటించిన సీఎం దగ్గరకు బాలుడు వెళ్లి తన బాధను తెలియజేశాడు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందడం లేదని, తనను ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని కోరాడు. తనకు చదువుకోవాలనుందని.. తనకు మంచి విద్య అందించాలని కోరాడు. చదువుకోవడానికి తగినంత డబ్బు తన దగ్గర లేదని చెప్పాడు. దాంతో నితిష్ కుమార్ ఆ అబ్బాయి చదువుకోడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 May 2022, 1:57 pm

ప్రధానాంశాలు:

  • బీహార్‌ సీఎం నితిష్‌కుమార్‌కు షాక్
  • కళ్యాణ్‌బిఘలో పర్యటించిన సీఎం
  • ముఖ్యమంత్రిని కలసిన బాలుడు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నితిష్ కుమార్
ఓ పదకొండేళ్ల పిల్లవాడు బీహార్ సీఎంకు షాక్ ఇచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న ఆ బాలుడు కోరిన కోర్కెకు సీఎం నితిష్ కుమార్ నిర్ఘాంతపోయారు. తన చదువుకు సపోర్ట్ చేయమని ఆ కుర్రాడు కోరాడు. అందులో ఇబ్బందేమి ఉందనుకుంటున్నారు. అయితే ఆ అబ్బాయి తనకు ప్రైవేట్‌ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించమని కోరాడు. గ్రామంలో తన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం లేదని.. అందుకే ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని కోరాడు.
నలంద జిల్లా హర్నాట్ బ్లాక్ పరిధిలోని సీఎం స్వగ్రామం కళ్యాణ్‌బిఘలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన భార్య మంజు కుమారి సిన్హా 16వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ తన గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సోను అనే అబ్బాయి సీఎం నితిష్‌కుమార్‌కు దగ్గరకు వెళ్లి.. తన వినతిని వినిపించాడు.

"సార్.. నా మాట వినండి...దయచేసి నా చదువుకు మద్దతు ఇవ్వండి. నా గార్డియన్ నా చదువుకు సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు. నేను చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను ఎలా అందించాలో ఉపాధ్యాయులకు తెలియడం లేదు' అని సోను సీఎంకు తెలిపారు. తనకు నాణ్యమైన విద్య కోసం తనను ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించాలని కోరాడు. సీఎం నితిష్ కుమార్ విద్యార్థి బాధను విన్నారు. వెంటనే బాలుడి చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని ఒక అధికారిని ఆదేశించారు.


తనకు నాణ్యమైన విద్యనందించేందుకు సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని బాలుడు తెలిపాడు. తన తండ్రి పెరుగు అమ్ముతుంటాడని, ఆ డబ్బుతో మద్యం తాగుతుంటాడని, తనను ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి తన దగ్గర అవసరమైన డబ్బు లేదని సోనూ చెప్పాడు. కానీ తను బాగా చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉందని చెప్పాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.