యాప్నగరం

రిసార్ట్ రాజకీయాలపై జోక్..సుప్రీంకోర్టులో నవ్వుల పువ్వులు

కర్ణాటకలో బలపరీక్షపై వాదనలు... సుప్రీంకోర్టులో నవ్వుల పువ్వులు పూయించాయి. బీజేపీ తరపున రోహత్గి... కాంగ్రెస్-జేడీఎస్ తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు.

Samayam Telugu 18 May 2018, 3:03 pm
కర్ణాటకలో బలపరీక్షపై వాదనలు... సుప్రీంకోర్టులో నవ్వుల పువ్వులు పూయించాయి. బీజేపీ తరపున రోహత్గి... కాంగ్రెస్-జేడీఎస్ తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో ఆసక్తికరం సంభాషణ జరిగింది. రోహత్గి బలపరీక్షకు మరికొంత సమయం కావాలని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కర్ణాటకలో లేరని... పొరుగు రాష్ట్రంలో నిర్భందంలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి... సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు.
Samayam Telugu Bus


రోహత్గి వాదనలు విన్న ధర్మాసనం సెటైరికల్‌గా స్పందించింది. ఎమ్మెల్యేలున్న రిసార్టుల్లోకి... వాటి యజమానుల్ని కూడా వెళ్లనివ్వడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని జోక్ వేసింది. రోహత్గి విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు అన్నట్లే పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి. నిన్నటి వరకు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు సమీపంలోని ఈగిల్టన్ రిసార్ట్‌లో ఉంచారు. అయితే అక్కడ పోలీసు భద్రతను తొలగించడం... తర్వాత పరిస్థితులు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి... ముందస్తు జాగ్రత్తగా వ్యూహాన్ని మార్చుకున్నారు.

అర్థరాత్రి కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక విమానాల్లో వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో... ప్రత్యేక బస్సుల్లో భాగ్యనగరానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలను రెండు మూడు హోటళ్లలో ఉంచారు. రేపు బల పరీక్ష ఉండటంతో వారిని ఈ రాత్రికి మళ్లీ బెంగళూరుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.