యాప్నగరం

మహిళలకూ అయ్యప్ప ఆలయ ప్రవేశం.. సుప్రీం సంచలన తీర్పు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళ ప్రవేశం విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆలయంలోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని తీర్పునిచ్చింది.

Samayam Telugu 18 Jul 2018, 4:40 pm
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళ ప్రవేశం విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆలయంలోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని తీర్పునిచ్చింది. ఆచారం ప్రకారం తరాలుగా ఈ దేవాలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. మహిళలందరూ దేవుడి సృష్టిలో భాగమే. ఉద్యోగం, పూజల్లో వారి పట్ల వివక్ష ఎందుకని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది.
Samayam Telugu SABARIMALA


అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదాస్పదం కాగా.. గత ఏడాది అక్టోబర్లో సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌కు ఈ కేసును అప్పగించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వివక్ష కిందకు వస్తుందా.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా అనే ప్రశ్నను ప్రస్తావించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఈ బెంచ్‌లో జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రలు సభ్యులుగా ఉన్నారు.

శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని.. అందులో తమకు అభ్యంతరాలేవీ లేవని 2007లో కేరళ సర్కారు ప్రకటించింది. తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సర్కారు.. దీన్ని వ్యతిరేకించింది. 800 ఏళ్లుగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.