యాప్నగరం

జూన్ 3 నుంచి ఈవీఎం హ్యాకింగ్ ఛాలెంజ్!

జూన్‌ 3 నుంచి ఈవీఎంల లోపాలుంటే ఎవరైనా నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నసీమ్ జైదీ ప్రకటించారు...

TNN 20 May 2017, 5:10 pm
ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి చూపించాలంటూ ఎలక్షన్ కమిషన్‌ (ఈసీ) గతంలో రాజకీయ పార్టీలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్‌ 3 నుంచి ఈవీఎంల లోపాలుంటే ఎవరైనా నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నసీమ్ జైదీ ప్రకటించారు. పారదర్శకమైన ఎన్నిక ప్రక్రియ జరిగేందుకు అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంలతో పాటు, వీవీపీఏటీ యంత్రాలను కూడా ఉపయోగించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంల పనితీరుపై సందేహాలున్నా, ట్యాంపరింగ్‌పై సరైన ఆధారాలున్నా తమ వద్దకు రావొచ్చంటూ ఈసీ ఆహ్వానించింది. ‘జాతీయ, రాష్ట్ర పార్టీలు.. ముగ్గురు ఉన్నతాధికారులను వెంట తెచ్చుకొని ట్యాంపరింగ్‌ చేసి చూపించవచ్చు. ఈ సవాలుపై ఆసక్తి ఉన్నవారు మే 26 సాయంత్రం 5 గంటలలోగా ఈసీకి సమాచారం ఇవ్వాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu evm hacking challenge from june 3 cec
జూన్ 3 నుంచి ఈవీఎం హ్యాకింగ్ ఛాలెంజ్!


ఈవీఎంల పనితీరుపై ఈసీ ఇవాళ (మే 20) నమూనా ప్రదర్శన నిర్వహించింది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని నిరూపించేందుకు డిల్లీలో ఈ ప్రదర్శన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జైదీ.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ట్యాంపరింగ్‌‌కు గురైనట్లు సరైన ఆధారాలు లేవని, ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు వాటి ట్యాంపరింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయాయని తెలిపారు.

‘ఈవీఎంలను తారుమారు చేయడం, అందులోని ఇంటర్నల్‌ సర్క్యూట్‌ను మార్చడం సాధ్యం కాదు. ట్యాంపరింగ్‌‌కు వీలు లేకుండా బలమైన టెక్నికల్ ఫీచర్లు ఈవీఎంలలో ఉన్నాయి’ అని జైదీ వెల్లడించారు. పారదర్శక ఎన్నికల నిర్వహణపై ఈసీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని ఆయన స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.