యాప్నగరం

ఆదర్శ్ స్కాంలో కాంగ్రెస్ నేతకు ఊరట!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన వేళా విశేషం ఏంటో గానీ వారికి శుభ పరిణామాలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టిపోటీని ఇచ్చి, గతం కంటే మెరుగైన స్థానాలు గెలుచుకుంది.

TNN 22 Dec 2017, 3:30 pm
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన వేళా విశేషం ఏంటో గానీ వారికి శుభ పరిణామాలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టిపోటీని ఇచ్చి, గతం కంటే మెరుగైన స్థానాలు గెలుచుకున్న రాహుల్ సారథ్ల్యంలోని కాంగ్రెస్, 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులోనూ నిన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా అనుకూలమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో సీబీఐ పేర్కొన్న 14 మంది నిందిలూ నిర్దోషులేనని పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ప్రకటించారు. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళి, టెలికమ్ శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహరాలకు ఈ తీర్పుతో ఊరట లభించింది. సీబీఐ న్యాయస్థానం తీర్పును చిదంబరం, మన్మోహన్ సింగ్ లాంటి సీనియర్ నేతలు స్వాగతించారు.
Samayam Telugu ex maharashtra cm ashok chavan escapes prosecution in adarsh scam for now
ఆదర్శ్ స్కాంలో కాంగ్రెస్ నేతకు ఊరట!


కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్‌ను విచారించరాదని బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో మాజీ సీఎం చవాన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో చవాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే చవాన్‌ను విచారించేందుకు 2013లో అప్పటి గవర్నర్‌ కే శంకర్ నారాయణన్ అనుమతి నిరాకరించారు. మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు తనపై రాజకీయ కక్ష సాధింపుల కోసమే గవర్నర్‌తో అనుమతి ఇప్పించారని అశోక్ చవాన్ విమర్శించారు.

కార్గిల్ అమరవీరుల కోసం ముంబైలో నిర్మించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 బహుళ అంతస్తున భవన సముదాయంలోని ఫ్లాట్లను పలువురు ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా కేటాయించుకున్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మహారాష్ట్ర సీఎంగా ఉన్న అశోక్ చవాన్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.