యాప్నగరం

Ex Russian Minister Arrest డెహ్రాాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో రష్యా మాజీ మంత్రి అరెస్ట్.. కారణం ఇదే

Ex Russian Minister Arrest రష్యా మాజీ మంత్రిని డూన్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయడం కలకలం రేగుతోంది. 64 ఏళ్ల విక్టర్ సెమెనోవ్ 1998 నుంచి 1999 వరకు మాస్కో వ్యవసాయ, ఆహార మంత్రిగా పనిచేశారు. ఆదివారం సాయంత్రం ఆయన విమానం ఎక్కేందుకు రాగా.. భద్రతా తనిఖీ సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 29 Nov 2022, 2:53 pm

ప్రధానాంశాలు:

  • భారత్‌కు వచ్చిన రష్యా మాజీ మంత్రి
  • శాటిలైట్ ఫోన్‌ను వెంటతెచ్చిన సెమెనోవ్
  • అరెస్ట్ చేసిన ఎయిర్‌పోర్ట్ పోలీస్ సిబ్బంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Russian Ex Minister
Ex Russian Minister Arrest సరైన పత్రాలు లేకుండా శాటిలైట్ ఫోన్‌ను తన వెంట తీసుకొచ్చిన రష్యా మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాలు, విమానాశ్రయాల్లోకి శాటిలైట్ ఫోన్లు తీసుకురావడం నిషేధం. ఈ నిబంధన ప్రకారం రష్యా మాజీ మంత్రి విక్టర్ సెమెనోవ్ (64)ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో విమానం కోసం ఎయిర్‌పోర్ట్‌కు సెమెనోవ్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం 4.20 గంటలప్పుడు తనఖీల సమయంలో ఆయన వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు.
తనిఖీల సమయంలో శాటిలైట్ ఫోన్‌ వినియోగానికి సంబంధించిన అవసరమైన ఎటువంటి పత్రాలను సమర్పించలేకపోయారని అధికారులు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ప్రకారం.. అత్యవసర సమయంలో వ్యక్తిగత ఉపయోగం కోసం శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు రష్యా మాజీ మంత్రి చెప్పారు. అయితే, ఆయన భారత్‌ పర్యటనకు ఎందుకొచ్చారనేది తెలియరాలేదు. కాగా, విక్టర్ సెమెనోవ్ 1998 నుంచి 99 వరకూ రష్యా వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉంటున్నారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.