యాప్నగరం

హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ 'కమల' వికాసం

హర్యానాలో ముగిసిన పోలింగ్.. ఈ నెల 24న ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే మొగ్గు.. మళ్లీ కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న మెజార్టీ సంస్థలు. క్లియర్ మెజార్టీ ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్.

Samayam Telugu 21 Oct 2019, 7:11 pm
Samayam Telugu haryana.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. పోలింగ్ బూతుల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ఓటరు తీర్పు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైపోగా.. గెలుపుపై ఎవరికే వారే ధీమాతో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈసారి గెలుపు తమదేనని బీజేపీ చెతుంటే.. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. హర్యానాలో కమల వికాసం ఖాయమని పోల్స్ చెబుతున్నాయి.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలో మరోసారి కమలనాథులు అధికారంలోకి రావడం ఖాయమంటోంది. తిరుగు లేని మెజార్టీతో బీజేపీ మళ్లీ అధికార పీఠంపై కూర్చోబోతున్నట్లు చెబుతోంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో.. బీజేపీ 71 సీట్లు దక్కించుకుంటుందని.. కాంగ్రెస్ కేవలం 11కే పరిమితమని.. ఇక ఇతర పార్టీలకు ఎనిమిది సీట్లు రావొచ్చని అంచనా వేస్తోంది.

రిపబ్లిక్-జన్‌కీబాత్
బీజేపీ: 52-63
కాంగ్రెస్: 15-19
INLD:01
JNJP: 07-09

భారత్‌వర్ష్
బీజేపీ-47
కాంగ్రెస్-23
INLD-09
ఇతరులు-03

సీఎన్‌ఎన్-న్యూస్ 18
బీజేపీ-75
కాంగ్రెస్-10
ఇతరులు-05

హర్యానాలోని 90 స్థానాలతో పాటూ మహారాష్ట్రలోని 288 స్థానాలు, 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అలాగే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరగనుంది.. సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.