యాప్నగరం

ఆత్మహత్య చేసుకుంటానని బాలిక పోస్ట్.. ఫేస్‌బుక్ అలర్ట్‌తో కాపాడిన పోలీసులు

ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్.. తరచూ ఇలాంటి ఘటనల్ని మనం చూస్తూనే ఉంది. ఈ మధ్యే ఓ కుర్రాడు ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రాణాలు కూడా తీసుకున్నాడు. తాజాగా అసోంలో దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

Samayam Telugu 26 Jul 2018, 10:42 am
ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్.. తరచూ ఇలాంటి ఘటనల్ని మనం చూస్తూనే ఉంది. ఈ మధ్యే ఓ కుర్రాడు ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రాణాలు కూడా తీసుకున్నాడు. జనాలంతా చోద్యం చూశారేకాని ఎవరీ కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. తాజాగా అసోంలో దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు పెట్టిన స్టేటస్ చూసి.. ఎక్కడో అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం స్పందించింది. స్థానిక పోలీసుల్ని అలర్ట్ చేసి.. ప్రాణాలు తీసుకోబోయిన బాలికను కాపాడేలా చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది.
Samayam Telugu FB


గౌహతికి చెందిన ఓ బాలిక ‘నేను ఇవాళ ఆత్మహత్య చేసుకుంటున్నా’అంటూ ఫేస్‌బుక్‌లో స్టేటస్ పెట్టింది. దీన్ని ఎంతోమంది నెటిజన్లు చూసి ఉంటారు కాని.. కనీసం స్పందించలేదు. ఈ పోస్ట్ అమెరికాలో ఉన్న ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్స్ ఉద్యోగుల కంటపడింది. వారు వెంటనే అసోం పోలీసుల్ని సంప్రదించారు. ఇలా ఓ బాలిక ప్రాణాలు తీసుకోబోతోందని.. ఆ పోస్టుకు సంబంధించిన వివరాలను అందించారు.

పోలీసులు ఆగమేఘాల మీద బాలిక అడ్రస్ కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. బాలికతో పాటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా ఆమెకు చెప్పి తీసేయించారు. పోలీసులు మాత్రం బాలిక వివరాలు.. ఆత్మహత్యకు కారణాలను మాత్రం బయటపెట్టలేదు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.