యాప్నగరం

ఫడ్నవీస్ స్థానంలో... మహారాష్ట్రకు కొత్త సీఎం?

బీజేపీ హై కమాండ్ ఇప్పుడు దేవేంద్రఫడ్నవీస్ విషయంలో మార్పు చేయనుందని తెలుస్తోంది.

TNN 14 Mar 2017, 1:19 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ కు ప్రమోషన్ ఇవ్వనున్నారా? ఆయన కేంద్రమంత్రిగా వెళ్లి, మహారాష్ట్ర కు కొత్త ముఖ్యమంత్రి రానున్నాడా? అంటే ఔననే అంటున్నాయి భారతీయ జనతా పార్టీ వర్గాలు. తాజాగా మనోహర్ పారికర్ చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించి.. ఆయనను గోవా సీఎంగా పంపిన బీజేపీ హై కమాండ్ ఇప్పుడు దేవేంద్రఫడ్నవీస్ విషయంలో మార్పు చేయనుందని తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్రమంత్రిగా తీసుకోవాలని భావిస్తున్నారట ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
Samayam Telugu fadnavis to become central minister
ఫడ్నవీస్ స్థానంలో... మహారాష్ట్రకు కొత్త సీఎం?


మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పనితీరు మోడీకి బాగా నచ్చిందని, ఫడ్నవీస్ తన మంత్రి వర్గంలో ఉంటే బావుంటుందని మోడీ అనుకుంటున్నారని.. అందుకే ఫడ్నవీస్ చేత రాజీనామా చేయించి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే జరుగుతుందన్న కేంద మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ లో ఈ మార్పు జరుగుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న చంద్రకాంత్ పాటిల్ ను ఫడ్నవీస్ స్థానంలో ఆ రాష్ట్ర సీఎంగా ఎంపిక చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం జరగబోతున్న కేంద్ర మంత్రి వర్గ మార్పులు ఆసక్తిని రేపుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.