యాప్నగరం

నకిలీ డాక్టర్... గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్!

కొన్ని రోజుల క్రితం వరకు కలకత్తా-హౌరాలోని రాంరాజతల్ల కేదారినాథ్ భట్టాచార్య వీధిలో డాక్టర్ సుభేందు భట్టాచార్యను

Samayam Telugu 12 Jun 2017, 1:38 pm
కొన్ని రోజుల క్రితం వరకు కలకత్తా-హౌరాలోని రాంరాజతల్ల కేదారినాథ్ భట్టాచార్య వీధిలో డాక్టర్ సుభేందు భట్టాచార్యను ప్రజలను దేవుడిలా ఆరాధించేవారు. ‘డాక్టర్ బాబు’గా పేరుగాంచిన 38 ఏళ్ల భట్టాచార్య పేదలకు ఉచితంగా వైద్యం చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారు. వీటితోనే ఆయనకు ఆ పేరు వచ్చింది. కానీ ఆయన ‘హెల్త్ కేర్’ పేరుతో వేలాది మందిని మోసం చేస్తున్నారని ఎవరికీ తెలియదు. అంతమంచి పేరున్న డాక్టర్ గనుకనే.. ఆయనకు గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానం దక్కింది. అంతేకాదు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా లైఫ్ టైం ఎచీవ్ మెంట్ పురస్కారం సైతం దక్కించుకున్నారు.
Samayam Telugu fake doctor who got guinness record arrested in bengal
నకిలీ డాక్టర్... గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్!


నకిలీ సర్టిఫికేట్లతో డాక్టర్ గా చలామణి అవుతున్న భట్టాచార్యను జూన్ 2న పోలీసులు అరెస్టు చేయడం స్థానిక ప్రజలు, పేషంట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండువారాల పాటు తప్పించుకు తిరుగుతున్న భట్టాచార్యను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

లండన్ లోని ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ లో అతి పిన్న వయస్కుడిగా సభ్వత్వం పొందినవారిలో ఉన్నానని చెప్పేవాడు. ‘హోదా కోసం ఎప్పుడూ భట్టాచార్య పరితపించేవాడు. డాక్టర్ కావడం అతని కల. డాక్టర్ కల నెరవేరకపోవడంతో నకిలీ డాక్టర్ గా అవతారమెత్తాడు’ అని అతని స్నేహితుడొకరు చెప్పారు.

మెడికల్ రంగంలో పేరున్న పరిశోధన సంస్థల్లో తనక సభ్యత్వం ఉందని భట్టాచార్య తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో రాసుకున్నారు. లండన్ తో పాటు అమెరికాలోని ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలలో డాక్టర్ కోర్సులు చేసినట్లు చెప్పుకునేవాడు.

ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు భట్టాచార్యను అరెస్టు చేసి.. ఆయన ఆధ్వర్యంలో నడిచే నర్సింగ్ హోంను సీజ్ చేశారు. వేలాది మంది రోగులతో ఆటలాడుకున్న భట్టాచార్యను చట్టం ప్రకారం శిక్షిస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.