యాప్నగరం

అమానుషం: హోం క్వారంటైన్‌లో కోవిడ్ రోగి కుటుంబం.. ఇంటికి ఇనుప రేకులతో సీల్!

కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన వ్యక్తి కుటుంబం బయటకు రాకుండా వారి ఇంటిని ఇనుప రేకులతో అధికారులు సీల్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో వాటిని తొలగించారు.

Samayam Telugu 24 Jul 2020, 2:12 pm
కోవిడ్-19 బాధితుడి కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉంచి, వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా ఇనుప రేకులతో ఫ్లాట్లను మూసివేసిన ఘటన బెంగళూరు నగరంలో గురువారం చోటుచేసుకుంది. అత్యవసర పరిస్థితి ఎదురయిన బయటకు రాలేని విధంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే అధికారులు చేసిన ఈ హోయమైన చర్యలను పక్క ఫ్లాట్‌లో ఉండే ఓ వ్యక్తి ఫోటోలు తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Samayam Telugu కోవిడ్ రోగి ఇంటికి సీల్
Bangalore Family house Seal


సిబ్బంది చేసిన బుద్ధిలేని పనికి బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తక్షణమే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.

‘కోవిడ్ నిర్దారణ అయిన వ్యక్తి ఇంటిని బీబీఎంపీ సీల్ చేసింది.. ఇద్దరు చిన్న పిల్లలతో ఓ మహిళ ఒక ఫ్లాట్‌లో, ఆ పక్కనే మరో ఫ్లాట్‌లో వృద్ధ దంపతులు ఉన్నారు... ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితేంటి.. బిబిఎంపీ కమిషనర్? వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకున్న చర్యలను అర్థం చేసుకున్నాం.. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది.. దయచేసి దీనిని అత్యవసరంగా పరిష్కరించండి’ అంటూ సతీశ్ సంగమేశ్వరన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఏదైనా ప్రమాదమే కాదు, అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర ప్రతిస్పందన బృందానికి నిత్యవసర సరుకుల కూడా కష్టతరం అవుతుందని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌పై స్పందించిన బీబీఎంపీ కమిషనర్.. ‘బారికేడ్లను వెంటనే తొలగించాలని ఆదేశించాం. వ్యక్తుల గౌరవాన్ని కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. వైరస్ సోకిన వారిని రక్షించడం, ఇతరులకు సంక్రమించకుండా సురక్షితంగా ఉండేలా చూడటం నియంత్రణ ఉద్దేశం’ అని అన్నారు.

‘ప్రతిష్ఠకు భంగం కలిగించే సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాం.. స్థానిక సిబ్బంది అత్యుత్సాహానికి క్షమాపణలు చెబుతున్నాం’ అని బీబీఎంపీ కమిషనర్ ట్విట్టర్‌లో స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.