యాప్నగరం

రైతు సంఘాల నేతల హత్యకు కుట్ర.. ఆగంతకుడిని పట్టుకున్న రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే పదకొండు దఫాలు చర్చలు జరిగినాా ఇంత వరకు ఎటువంటి పరిష్కారం లభించలేదు.

Samayam Telugu 23 Jan 2021, 1:10 pm
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతల హత్యకు కుట్ర పన్నిని విషయం బట్టబయలయ్యింది. సింఘూ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని రైతులు శుక్రవారం సాయంత్రం పట్టుకుని నిలదీయడంతో కుట్రకోణం బయటపడింది. రైతు సంఘాల నేతలను హత్యచేయడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారని వెల్లడించాడు. జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి అంతరాయం కలిగించడంలో భాగంగా రైతు సంఘాల నేతలను హత్యకు రెండు బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపాడు.
Samayam Telugu ట్రాక్టర్ ర్యాలీ


రైతు నేతల హత్యకు పథక రచన చేసిన ఓ ముఠా సభ్యుడు ముసుగు వేసుకొని సంచరిస్తుండగా రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తమ ఆందోళనకు భంగం కలిగించేలా దుర్మార్గపు కుట్ర పన్నారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. శుక్రవారం రాత్రి రైతు సంఘాల నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ర్యాలీలో రైతుల సమూహాలను చెదరగొట్టడానికి సగం మంది ఆగంతకులు పోలీసుల వేషంలో హాజరు కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. జనవరి 26న తమ ముఠా సభ్యులు ఆందోళనలో రైతులతో కలిసిపోయి రైతు సంఘాల నేతలపై కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నట్లు పట్టుబడిన వ్యక్తి కుట్రకోణం బయటపెట్టాడు.

రైతుల నిరసనకు విఘాతం కలిగించడానికి ముఠా సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 వేల ఇచ్చారని, తాము డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నామని పట్టుబడిన వ్యక్తి చెప్పారు. రైతుల పట్టుకున్న వ్యక్తి ని ప్రదీప్ అని గుర్తించారు. ‘జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమైన తర్వాత ఢిల్లీ పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు.. ఈ సమయంలో తొలి వరుసలో ఉన్న తమ ముఠా సభ్యులు కాల్పులు జరుపుతారు.. రైతులను తొలుత ఆపడానికి ప్రయత్నించాలి... ఒకవేళ వాళ్లు ఆగకపోతే కాల్పులు జరపాలని ఆదేశాలు వచ్చాయి’ అని పట్టుబడిన వ్యక్తి వెల్లడించారు.

‘జనవరి 24న వేదికపై నలుగురు రైతు సంఘాల నేతలను హత్యచేయడానికి పథకం వేశాం.. ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి తమకు శిక్షణ ఇచ్చాడు.. ఆయన రాయ్ స్టేషన్ హైస్ ఆఫీసర్.. తమను కలవడానికి వచ్చినప్పుడు ఆయన మాస్క్ వేసుకుని ఉన్నారు’ అన్నాడు. అయితే, ప్రదీప్ సింగ్ అనే పేరుతో తమ స్టేషన్‌లో ఏ అధికారి లేరని రాయ్ ఎస్‌హెచ్ఓ వివేక్ మాలిక్ అన్నారు. వివేక్ మాలిక్ ఏడు నెలల కిందటే రాయ్ స్టేషన్‌లో చేరారు. పట్టుబడిన వ్యక్తి మీడియా ముందు వెల్లడించిన విషయాలు విని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.