యాప్నగరం

8 రాష్ట్రాలకు నిత్యావసరాలు బంద్.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులు

అన్నదాతల 'గావ్ బంద్' ఉధృతంగా సాగుతోంది. రైతులు మూడు రోజులుగా సమ్మెకు దిగడంతో.. నిత్యావసరాలన్నీ నిలిచిపోయాయి. పట్టణాలకు పాలు, కూరగాయలు సహా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

Samayam Telugu 3 Jun 2018, 4:00 pm
అన్నదాతల 'గావ్ బంద్' ఉధృతంగా సాగుతోంది. రైతులు మూడు రోజులుగా సమ్మెకు దిగడంతో.. నిత్యావసరాలన్నీ నిలిచిపోయాయి. పట్టణాలకు పాలు, కూరగాయలు సహా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం 8 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటూ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కూరగాయలే లేక.. అక్కడి మార్కెట్లన్నీ వెల, వెలబోయాయి. పాలు కూడా అంతంతమాత్రంగానే దొరుకుతుండటంతో.. ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కొంతమంది జనాలు మాత్రం గత్యంతరం లేని స్థితిలో పల్లెటూర్లకు వెళ్లి నిత్యావసరాలను కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.
Samayam Telugu Farmers


నిత్యవసరాల సరఫరాను నిలిపివేసిన అన్నదాతలు శాంతియుతంగానే నిరసనను తెలుపుతున్నారు. మొత్తం 150కిపైగా సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు పలికాయి. రైతుల ఆందోళన ఇలా ఉంటే.. బంద్‌పై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అన్నదాతల ఆందోళన ఓ జిమ్మిక్ మాత్రమేనని.. మీడియా ఫోకస్ కోసమే ఇలా అనవసరం రాద్ధాంతం చేస్తున్నారనడంపై వారు భగ్గుమన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించమని అడగటం కూడా తప్పులా ఉందని.. ఇలా హేళన చేయడం ఏంటని మండిపడ్డారు.

మొన్నే హర్యానా సీఎం ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రైతులు చేస్తున్నదానికి కారణమే లేదని.. పనికిరాని అంశాలపై సమ్మె చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపగా.. అన్నదాతలు నిరసన తెలియజేశారు. అది మర్చిపోక ముందే మళ్లీ ఇప్పుడు రాధామోహన్ సింగ్ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.