యాప్నగరం

అప్పుడే పుట్టిన శిశువుకి జీఎస్టీ అని పేరు పెట్టారు

ఇప్పుడు దేశంలో ఎవరినోట విన్నా జీఎస్టీ గురించే వినిపిస్తోంది. దేశాన్ని ఆర్థికంగా మరో మలుపు తిప్పుతుందని...

Samayam Telugu 2 Jul 2017, 7:15 pm
ఇప్పుడు దేశంలో ఎవరినోట విన్నా జీఎస్టీ గురించే వినిపిస్తోంది. దేశాన్ని ఆర్థికంగా మరో మలుపు తిప్పుతుందని ఆశిస్తూ కేంద్రం తీసుకువచ్చిన ఈ జీఎస్టీపై దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే, జీఎస్టీ అమలైన శుక్రవారం రాత్రి జన్మించిన కొంతమంది శిశువులకి తల్లిదండ్రులు జీఎస్టీ అనే నామకరణం చేశారనే వార్త ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
Samayam Telugu father named his newborn daughter as gst in rajasthan
అప్పుడే పుట్టిన శిశువుకి జీఎస్టీ అని పేరు పెట్టారు


రాజస్థాన్‌లోని పాలి జిల్లా కేంద్రానికి చెందిన జస్‌రాజ్ భార్యకి శుక్రవారం రాత్రే ప్రసవవేదనతో నొప్పులు రావడంతో ఆమెని బాంగడ్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి పార్లమెంట్‌లో జీఎస్టీ బిల్లు అమలైన సందర్భంలోనే ఇక్కడ ఆస్పత్రిలో జస్‌రాజ్ భార్య పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడపిల్ల. వీరిలో ఆడ పిల్లకి జీఎస్టీ అని నామకారణం చేశారు జస్‌రాజ్ దంపతులు. అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కూడా ఆ శిశువుని జీఎస్టీ అనే పిలవడం మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన కవలలని చూడటానికి వచ్చిన బంధువులు, సన్నిహితమిత్రులు సైతం పాపని జీఎస్టీ అనే పేరుతోనే పిలవడానికి ఆసక్తి కనబర్చారు.

తమకి పుట్టిన పాపకి జీఎస్టీ అని పేరు పెట్టడంపై స్పందించిన జస్‌రాజ్... " ప్రస్తుతానికి ఆస్పత్రిలో అందరూ అలా జీఎస్టీ అని పిలవడం జరిగింది కానీ ఆ తర్వాత జన్మ నక్షత్రాన్నిబట్టి మరో పేరు మార్చుతాం" అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.