యాప్నగరం

అమ్మవారి ఉత్సవాలపై రగడ... కర్రలతో కొట్టుకున్న రెండు వర్గాలు

మధ్యప్రదేశ్‌లో నవరాత్రి ఉత్సవాలపై గొడవ జరిగింది. కంకర్ గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. తాము విగ్రహం ప్రతిష్టించుకున్నందుకే దాడి చేశారని ఓ వర్గం చెబుతుంది. మరొక వర్గం అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడం వల్ల గొడవ మొదలైందని మరొక వర్గం ఆరోపణలు చేసింది. దీంతో రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 2 Oct 2022, 8:49 pm

ప్రధానాంశాలు:

  • మధ్యప్రదేశ్‌లో మళ్లీ గొడవలు
  • నవరాత్రి ఉత్సవాలపై ఘర్షణ
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu fight with sticks in madhya pradesh
దేవి శరన్నవరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో మళ్లీ గొడవలు చెలరేగాయి. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. భోపాల్‌లకు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న అగర్ జిల్లాలో ఇది జరిగింది. కంకర్ గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. దారుణం కొట్టుకున్నారు.
దళిత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దసరా పండుగ సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాము విగ్రహం పెట్టామనే అక్కసుతో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులు ఆదివారం తమపై దాడికి పాల్పడ్డారని.. దళిత వర్గానికి చెందిన వ్యక్తులు ఆరోపించారు. మరో వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రం.. గర్బా వేడుకలో భాగంగా ఇద్దరు అమ్మాయిలు అశ్లీల డ్యాన్స్‌ చేశారని, దాంతో గొడవ మొదలైందని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణ చోటుచేసుకుందని చెప్పుకొచ్చారు.

దీంతో రెండు వర్గాల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రెండు వర్గాలకు చెందిన ప్రజలు కర్రలతో కొట్టుకున్న వీడియో క్లిప్‌లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. "ఒక డ్యాన్స్ గొడవకు దారితీసింది. మేము రెండు వైపుల నుంచి ఫిర్యాదులను నమోదు చేశాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం." అని సీనియర్ పోలీసు అధికారి నవల్ సింగ్ సిసోడియా చెప్పారు. మరోవైపు గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.