యాప్నగరం

ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం, ఒక మహిళ మృతి

ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో ఓ భవనంలో మంటలు వ్యాపించాయి. అగ్ని జ్వాలలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. మూడు అంతస్థుల భవనంలోని సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. తొమ్మిది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కంపెనీ యజమానిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 13 May 2022, 8:57 pm
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిజ్వాలలు చెలరేగాయి. ఆ భవన పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముండ్కా మెట్రో స్టేషన్‌లోని పిల్లర్ నంబర్ 544 సమీపంలోని భవనంలో మంటలు వ్యాపించాయి. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Samayam Telugu అగ్నిప్రమాదం



భవనంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అయితే ఈ ఘటనలో ఒక మహిళ మృతదేహం లభ్యమైందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మూడు అంతస్తుల బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో మంటలు అంటుకున్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ కంపెనీ యజమాని పోలీసుల అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఘటనా స్థలంలో తొమ్మిది అగ్నిమాపక దళాలు ఉన్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. కాగా కొన్ని గంటల ముందే జమ్మూ కశ్మీర్‌లో ఓ బస్సులో కూడా మంటలు వ్యాపించి.. నలుగురు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.