యాప్నగరం

మిరాకిల్ బేబీ.. ఆ కేరళ వ్యక్తి మృతి!

సుమారు శతాబ్దం కిందట సిజేరియన్ ద్వారా జన్మించిన తొలి కేరళ బాలుడిగా రికార్డులకెక్కిన వ్యక్తి 98 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. మిరాకిల్ బేబీగా అప్పట్లో ఈయణ్ని పిలిచారు.

Samayam Telugu 11 May 2018, 4:07 pm
సిజేరియన్ ద్వారా జన్మించిన తొలి కేరళ బాలుడి మైఖేల్ సవరిముత్తు (98) శుక్రవారం కన్నుమూశారు. మైఖేల్ స్వస్థలం తిరువనంతపురం సమీపంలోని పాలయం. 1920లో మైఖేల్, మేరీ దంపతులకు సవరిముత్తు నాల్గో సంతానంగా జన్మించాడు. థైకాడ్‌లోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేసి ముత్తు తల్లికి పురుడుపోశారు. అంతకు ముందు పుట్టిన ముగ్గురు పిల్లలు పురిట్లోనే చనిపోవడంతో సవరిముత్తును తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ మేరీ పున్నన్ ల్యూకోజ్ పర్యవేక్షణలో ఈ తొలి సిజేరియన్ నిర్వహించారు. ఈయనే సిజేరియన్‌ ద్వారా పురుడుపోసే ప్రక్రియను కేరళకు పరిచయం చేశారు. అంతకు ముందు పుట్టిన ముగ్గురు పిల్లలు పురిట్లోనే చనిపోవడంతో సాధారణ కాన్పుకు ప్రయత్నిస్తే ఈ బిడ్డ కూడా దక్కదని వైద్యులు మేరీ దంపతులను హెచ్చరించారు.
Samayam Telugu మైఖైల్ సవరిముత్తు


అదే సమయంలో ఆపరేషన్ వల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని భరోసా ఇచ్చారు. వైద్యుల ప్రతిపాదనను మేఖేల్, మేరీలు ముందు అంగీకరించకపోయినా, వారు నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. దీన్ని ఓ అద్భుతంగా భావించిన నాటి జనం, సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డను చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చేవారు. అతడిని మిరాకిల్ బేబీగా అభివర్ణించారు. పెరిగి పెద్దవాడైన తర్వాత సవరిముత్తు ఇండియన్ ఆర్మీలో చేరి, చాలా కాలం పాటు సేవలు అందించాడు. రోశమ్మ అనే మహిళను వివాహమాడిన సవరిముత్తుకు, అలెగ్జాండర్, లీల, ఫిలోమినే అనే పిల్లలు కూడా ఉన్నారు. చివరిలో కేరళ ప్రభుత్వ ప్రెస్‌ ఉద్యోగిగా ఆయన పదవీవిరమణ చేశారు.

Read This Story in Malayalam

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.