యాప్నగరం

కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్ ఫ్రెండ్లీ టాయిలెట్

వసతులు లేని కారణంగా ఆమెకు (ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు) ఆలస్యంగా అడ్మిషన్ ఇచ్చింది కాలేజీ మేనేజ్‌మెంట్.

Samayam Telugu 25 Sep 2018, 5:26 pm
ట్రాన్స్‌జెండర్లకు తగిన సదుపాయాలు కల్పిస్తూ కేరళ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో మలప్పురంలోని ప్రభుత్వ కాలేజీలో తొలి ట్రాన్స్ జెండర్ టాయిలెట్ నిర్మించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది. కాగా, కేరళలో ఇది తొలి ట్రాన్స్ జెండర్ టాయిలెట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాయిలెట్ విషయంపై పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu First Transgender friendly Toilet


రియా ఇషా అనే ట్రాన్స్ జెండర్ బీఏ ఎకనామిక్స్‌లో కొన్ని రోజుల కిందట జాయిన్ అయ్యారు. అయితే వసతులు లేని కారణంగా ఆమెకు (ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు) ఆలస్యంగా అడ్మిషన్ ఇచ్చింది కాలేజీ మేనేజ్‌మెంట్. ఇషా అనే విద్యార్థిని తొలి ట్రాన్స్ జెండర్ స్టూడెంట్ కావడం విశేషం. కాలేజీలో చేరిన తర్వాత తమకు టాయిలెట్ కట్టించాలని, వారి సమస్యలను ప్రిన్సిపాల్‌కు చెప్పారు ఇషా. నిజంగానే ట్రాన్స్ జెండర్లకు ఇది సమస్య అవుతుందని భావించిన కాలేజీ సిబ్బంది వారికి ప్రత్యేక టాయిలెట్ కట్టించి ఇచ్చింది. సోమవారం (సెప్టెంబర్ 24న) తొలి ట్రాన్స్ జెండర్ వాష్‌రూమ్‌ వినియోగంలోకి వచ్చింది.

ఇటీవల సుప్రీంకోర్టు 377 సెక్షన్‌లో ఎల్జీబీటీలకు కాస్త సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కం (గే, లెస్బియన్) తప్పుకాదని, ఎల్జీబీటీలకు ఇతరులతో పాటు సమాన హక్కులున్నాయని సుప్రీం తీర్పు తర్వాత ఎంతో మార్పు కనిపిస్తోంది. ట్రాన్స్ జెండర్లను తగిన గౌరవం ఇవ్వడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.