యాప్నగరం

8ఏళ్ల బాలికపై ఐదుగురు స్కూల్ విద్యార్థుల అత్యాచారం

ట్రెండ్ మారిపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. సీనియర్ సిటిజన్ నుంచి ఆఖరికి స్కూల్‌కెళ్లే పిల్లల చేతిలో కూడా ఫోన్ వచ్చేస్తున్న రోజులివి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో.. అనర్థాలు అన్నే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల చాలా దారుణాలే జరిగాయి.

Samayam Telugu 17 Jul 2018, 8:26 am
ట్రెండ్ మారిపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. సీనియర్ సిటిజన్ నుంచి ఆఖరికి స్కూల్‌కెళ్లే పిల్లల చేతిలో కూడా ఫోన్ వచ్చేస్తున్న రోజులివి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో.. అనర్థాలు అన్నే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల చాలా దారుణాలే జరిగాయి. ఇలా మొబైల్ ఫోన్లలో బూతు బొమ్మలకు అలవాటు పడి పసివయసులోనే అకృత్యాలకు ఒడిగట్టిన ఘటనల్ని ఈ మధ్య చాలానే చూశాం. తాజాగా డెహ్రడూన్‌లోనూ వీటికంటే అమానుషమైన ఘటన జరిగింది. బూతు వీడియోలు చూడటానికి అలవాటుపడిన ఐదుగురు స్కూల్ విద్యార్థులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడటం కలకలంరేపింది.
Samayam Telugu Rape


పోలీసులు వివరాల మేరకు.. సాహస్‌పూర్‌కు చెందిన ఓ పిల్లవాడి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. అతడు కొద్దిరోజులుగా తన మొబైల్‌లో.. నలుగురు స్నేహితులతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఆ వీడియోలకు అలవాటుపడిన వీళ్లంతా.. వారి ఇళ్ల పొరుగునే ఉండే ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశారు. ఆమె ఒంటిరిగా ఉండటాన్ని గమనించారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఐదుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. ఐదుగురు పిల్లల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ బాలుడు జరిగిన దారుణం మొత్తాన్ని పోలీసులకు చెప్పాడు. మొబైల్‌లో బూతు వీడియోలు చూసి.. బాలికపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు. రెండు మూడు రోజులుగా బాలిక ఇంటి ముందు ఒంటరిగా ఆడుకోవడాన్ని గమనించామని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడట. ఐదుగురిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి.. జువైనల్ హోమ్‌కు తరలించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.