యాప్నగరం

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు

ఉగ్రమూకల కోసం శ్రీనగర్ సరిహద్దు ప్రాంతాన్ని భద్రతా బలగాలు అణువణువు గాలిస్తున్నాయని ఓ అధికారి తెలిపారు.

Samayam Telugu 29 Oct 2018, 10:47 pm
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. గస్తీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ఎఫ్)కు చెందిన ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్ సరిహద్దులోని పంత్నా చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu BSF Jawwans


ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై సీఆర్‌పీఎఫ్ ఐజీ రవిదీప్ సింగ్ సాహి మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని రెండు వాహనాలలో 163వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు హెడ్ క్వార్టర్స్‌కు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రమూకల కాల్పుల ఘటనలో ఐదురుగురు సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఉగ్రమూకల కోసం శ్రీనగర్ సరిహద్దు ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.