యాప్నగరం

లోయలో పడిపోయిన బస్సు.. స్పాట్‌లో ఐదుగురు మృతి.. ఆస్పత్రిలో 25 మంది

జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir) మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవలం 24 గంటల్లోనే మరో బస్సు లోయలో పడిందిపోయింది. దీంతో అక్కడికక్కడే ఐదు మంది చనిపోయారు. 25 మందిని గాయాలయ్యాయి. వారందరిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అయితే బుధవారం కూడా మినీ బస్సులో లోయలో పడిపోయింది. ఆ ఘటనలో 11 మంది చనిపోయారు. మరెంతో మందికి గాయాలయ్యాయి. వరస ప్రమాదాలు స్థానికుల్లో భయాందోళనను సృష్టిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 15 Sep 2022, 3:10 pm

ప్రధానాంశాలు:

  • 24 గంటల్లో రెండో ఘోర ప్రమాదం
  • సహాయక చర్యలు చేపడుతున్న సైన్యం
  • విచారం వ్యక్తం చేస్తూ మనోజ్ సిన్హా ట్వీట్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bus accident in Rajouri
జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాజౌరి జిల్లాలో గురువారం బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. బస్సు పూంచ్ నుంచి జమ్మూ వెళ్తుండగా గలి సమీపంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలసి, గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. "రాజౌరిలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది." అని ఆయన ట్వీట్ చేశారు.


అయితే జమ్మూకశ్మీర్‌లో 24 గంటల్లో ఇది రెండో ప్రమాదం. బుధవారమే పూంఛ్ జిల్లాలోని సాజియాన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ మండిలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు లోయలో పడినప్పుడు అందులో 36 మంది ఉన్నారు. పూంఛ్ నుంచి గాలి మైదాన్‌కు బస్సు వెళ్తున్న సమయంలో సాజియాన్‌లోని బ్రారీ నాలాకు రాగానే బస్సు అదుపు తప్పింది. ఇది జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే సైన్యం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.