యాప్నగరం

పెళ్లికి వచ్చే అతిథుల కోసం విమానాన్నే బుక్ చేసిన వధూవరులు

Rajasthan Wedding: పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఓ జంట ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. బంధువులతో కలిసి విమానంలో ప్రయాణిస్తూ సందడి చేసింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 3 Dec 2022, 11:44 pm
భారతీయ సంప్రదాయంలో పెళ్లిళ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. ధనవంతులైనా, మధ్యతరగతి వారైనా.. తమ కుమార్తె/ కుమారుడి పెళ్లిని ఉన్నంతలో ఘనంగా చేసేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు తల్లిదండ్రులు. వచ్చే అతిథులకు కొత్త అనుభూతిని అందించేందుకు తహతహలాడుతుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటివన్నీ ఈ క్రమంలో వచ్చినవే. ఇవన్నీ పాతబడ్డాయనుకున్నారేమో రాజస్థాన్‌కు చెందిన ఓ జంట మరింత వైవిధ్యమైన ఆలోచన చేసింది. అతిథులను తీసుకెళ్లేందుకు ఏకంగా విమానం బుక్ చేసింది. ఆ ఫ్లైట్లో బంధువర్గమంతా కలిసి ప్రయాణిస్తూ.. సందడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విమానంలో వధూవరులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజిటల్ క్రియేటర్ శ్రేయా సాహ్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Samayam Telugu Rajasthan Wedding
రాజస్థాన్ పెళ్లి


రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు, వరుడి తరఫు బంధువులను తీసుకెళ్లేందుకు విమానాన్ని బుక్‌ చేశారు. ఈ రీల్‌ను ఇప్పటికే కోటి మందికి పైగా వీక్షించారు. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకున్నవారు, సముద్ర గర్భంలో పెళ్లి చేసుకున్నవారు, షిప్‌లో వివాహం చేసుకున్నవారు ఇలా చాలా జంటలు ఉన్నాయి గానీ.. బంధువులకు విమానాన్ని ఏర్పాటు చేసిన జంట మాత్రం ఇదే మొదటిది అయుండొచ్చు..!

View this post on Instagram A post shared by Shreya Shah | Content Creator (@shreyaa_shaah)

‘మీరు ధనవంతులు అని చెప్పకుండా రిచ్ అని చెప్పండి (Tell me you are rich without telling me you are rich)’ అంటూ ఓ యూజర్ చేసిన కామెంట్ మరో రకమైన చర్చకు తావిచ్చింది. రిచ్‌నెస్ అనేది డబ్బు, దర్పం చూపించుకోవడంలో ఉండదని, మనం చేసే పనుల్లో ఉంటుందనే అర్థంతో అతడు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

‘నా బంధువులు ఇంతటి మర్యాదలకు అర్హులు కారు’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. ‘ఆ ప్రయాణీకులందరూ పెయిడ్ ఆర్టిస్ట్’ అంటూ ఇంకో యూజర్ విమర్శించాడు. ‘పెళ్లిలో వడ్డించిన వంటలు, వధువు డ్రెస్సు, వరుడి ఉద్యోగం గురించి చెడుగా మాట్లాడకుండా.. భారతీయ వివాహాలు అసంపూర్ణంగా ఉంటాయి’ అంటూ మరొక నెటిజన్ చమత్కరించడం కొసమెరుపు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.