యాప్నగరం

8 నుంచి యూకే విమానాలు తిరిగి ప్రారంభం

UK Coronavirus: కొత్త వైరస్ నేపథ్యంలో భారత్, బ్రిటన్ మధ్య నిలిచిపోయిన విమానాల రాకపోకలను జనవరి 8 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను వెల్లడించారు.

Samayam Telugu 1 Jan 2021, 8:22 pm
రోనా కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్-యూకే మధ్య రద్దైన విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జనవరి 8 నుంచి ఇరు దేశాల మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం (జనవరి 1) తెలిపారు. జనవరి 23 వరకు వారానికి 15 విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Samayam Telugu విమానాలు
Flights resume


హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై.. ఈ నాలుగు నగరాల నుంచి మాత్రమే యూకేకు విమానాలు తిరిగి ప్రారంభం అవుతాయని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. యూకే నుంచి కూడా ఇక్కడికి విమానాలు నడుస్తాయని.. అక్కడ నుంచి కూడా వారానికి 15 విమానాలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.