యాప్నగరం

రైల్వే ఆహారం తిని 24 మందికి అస్వస్థత!

రైల్వే ఆహారం తిని దాదాపు 24 మంది ప్రయాణికులు ఆస్పత్రిపాలయ్యారు. ఉదయం ప్యాంట్రీ సిబ్బంది అందించిన ఆహారం తిన్న ప్రయాణికులు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Samayam Telugu 15 Oct 2017, 6:55 pm
రైల్వే ఆహారం తిని దాదాపు 24 మంది ప్రయాణికులు ఆస్పత్రిపాలయ్యారు. గోవా - ముంబయి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ప్యాంట్రీ సిబ్బంది అందించిన ఆహారం తిన్న ప్రయాణికులు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఫుడ్ పాయిజన్ జరిగిందనే అనుమానంతో రైలును మహారాష్ట్రలోని కొంకణ్‌లో నిలిపి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ స్పందిస్తూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికుల ఆరోగ్యానికి ముప్పులేందని తెలిపింది. ‘‘ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం. విచారణ నిమిత్తం ఆహార నమూనాలను సేకరించాం’’ అని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.