యాప్నగరం

వీడియో: పాముతో ఫొటో దిగబోయి ప్రాణాల మీదకు

అటవీ ప్రాంతంలో కనిపించిన కొండచిలువను పట్టుకున్నాకా దాన్ని మెడలో వేసుకుని ఫొటోలకు పోజు ఇవ్వబోయాడు ఒక అటవీ శాఖ అధికారి. అ

TNN 19 Jun 2018, 1:38 pm
అటవీ ప్రాంతంలో కనిపించిన కొండచిలువను పట్టుకున్నాకా దాన్ని మెడలో వేసుకుని ఫొటోలకు పోజు ఇవ్వబోయాడు ఒక అటవీ శాఖ అధికారి. అయితే పాముతో ఫొటోలకు పోజు అంటే అదెంత ప్రమాదకరమో ఆయనకు ఆ వెంటనే అర్థం అయ్యింది. అంతవరకూ కామ్‌గానే కనిపించిన ఆ పాము ఉన్నట్టుండి రెచ్చిపోయింది. తనను మెడలో వేసుకున్న వ్యక్తిని చుట్టేసి మింగేయడానికి సన్నద్ధం అయ్యింది. అప్పటికే ఆ అధికారికి వెన్నులో వణుకు పుట్టింది. చుట్టు ఉన్న వాళ్లు కొండచిలువను నియంత్రించడంతో ఆ అధికారి సురక్షితంగా బయటపడ్డాడు. బతుకు జీవుడా అనుకుని అక్కడ నుంచి పామును పట్టుకుని వేగంగా వెళ్లిపోయి దాన్ని కేజ్‌లోకి వేసేశాడు.
Samayam Telugu phytanattack



పశ్చిమబెంగాల్ లోని జల్‌పైగురి అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ దొరికిన కొండచిలువను సంజయ్ దత్తా అనే అటవీ శాఖ అధికారి మెడలో వేసుకుని మీడియా ముందు పోజులు ఇవ్వబోయాడు. అంతవరకూ అచేతనంగా కనిపించిన అది అధికారిని చుట్టేయ ప్రయత్నించింది. దాదాపు అతడిని చుట్టేసింది కూడా. అయితే చుట్టూ ఉన్న వాళ్ల సహకారంతో దత్తా సురక్షితంగా బయటపడ్డాడు. పాములతో ఫొటోలు ప్రమాదం సుమా అనే సందేశాన్ని ఇస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.