యాప్నగరం

శ్రీనగర్‌ ఎన్నికల్లో గెలిచిన మాజీ సీఎం!

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన రీ-పోలింగ్‌లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్..

TNN 15 Apr 2017, 5:33 pm
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన రీ-పోలింగ్‌లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా.. తన ప్రత్యర్థి, పీడీపీకి చెందిన నజీర్ అహ్మద్ ఖాన్‌పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఫరూక్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. నాటి ఎన్నికల్లో గెలుపొందిన పీడీపీ అభ్యర్థి తారిఖ్ కర్రా తన పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ఈ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
Samayam Telugu former jk cm farooq abdullah wins srinagar bypoll
శ్రీనగర్‌ ఎన్నికల్లో గెలిచిన మాజీ సీఎం!


ఏప్రిల్‌ 9న నిర్వహించిన ఉప ఎన్నికల సందర్భంగా.. ఘర్షణ తలెత్తడంతో ఓటింగ్‌ శాతం తక్కువగా (7 శాతం) నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో శ్రీనగర్‌లోని 38 కేంద్రాల్లో ఏప్రిల్ 13న రీపోలింగ్‌ నిర్వహించారు. ఘర్షణలు చెలరేగుతాయేమోనని ప్రజలు ఓటు వేయడానికి భయపడటంతో మరోసారి అతి తక్కువగా.. కేవలం 2 శాతమే పోలింగ్ నమోదైంది. ఇది ఇప్పటివరకూ దేశంలోనే అతి తక్కువ ఓటింగ్ శాతంగా ఉంది. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.