యాప్నగరం

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం విషమం!

మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించినట్లు తెలిసింది.

Samayam Telugu 15 Aug 2018, 8:02 pm
మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ మరికొద్ది సేపటిలో హెల్త్ బులెటిన్ విడుదల చేయనుంది.
Samayam Telugu 64572686


వాజ్‌పేయి ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో బీజేపీ పార్టీ తమ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. గురువారం విజయవాడలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.