యాప్నగరం

పెద్ద నోట్ల రద్దుతో మంచి రోజులు: దువ్వూరి సుబ్బారావు

దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందు ముందు మంచి ఫలితాలను ఇస్తుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, మన తెలుగువాడైన దువ్వూరి సుబ్బారావు చెప్పారు.

TNN 7 Dec 2016, 9:27 am
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందు ముందు మంచి ఫలితాలను ఇస్తుందని దేశ ఆర్థికాభివృద్ధికి ఇది కీలకమైన మేలు మలుపని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, మన తెలుగువాడైన దువ్వూరి సుబ్బారావు చెప్పారు. నోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు.
Samayam Telugu former rbi governor duvvuri subbarao research on demonetization
పెద్ద నోట్ల రద్దుతో మంచి రోజులు: దువ్వూరి సుబ్బారావు

సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకీ దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం ప్రచురించిన ఒక రీసెర్చ్ స్టడీలో ఆయన ఈ విషయం చెప్పారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమైనవేనన్నారు. ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా ప్రజలకు కూడా మేలు చేసేదేనని తెలిపారు. నోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు కూడా విచక్షణతో తమకు అవసరమైన వాటినే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారని, అదనపు అక్కరలేని ఖర్చులకు ఇది కళ్లెం వేస్తుందని చెప్పారు. డిపాజిట్లు పెరగడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇది అంతిమంగా ప్రజల మేలుకే దారితీస్తుందన్నారు. నగదు అవసరమైన రీతిలో లభ్యం కాకపోవడం వల్ల కొద్దిపాటి విపరిణామాలు చోటుచేసుకున్నట్లు కనిపించినా అవి తాత్కాలికమేనని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.