యాప్నగరం

విషమంగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఆరోగ్యం

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ (89) ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

Samayam Telugu 12 Aug 2018, 12:40 pm
లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ (89) ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న సోమనాథ్‌ను వైద్యం కోసం ఆగస్టు 10 న కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోన్న సోమనాథ్‌కు గత జూన్‌లో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందజేయడంతో ఆయన కోలుకున్నారు. అలాగే జులైలో శ్వాససంబంధ సమస్యతోనూ హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్ది రోజుల కిందటే డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం మళ్లీ అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సీపీఎం నేతలు హాస్పిటల్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Samayam Telugu సోమ్‌నాథ్ ఛటర్జీ


లోక్‌సభకు అత్యధిక సార్లు ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో సోమ్‌నాథ్ కూడా ఒకరు. 1971 నుంచి 2009 వరకూ మధ్యలో 1984లో ఒక్కసారి తప్ప అన్ని ఎన్నికల్లోనూ గెలుపొందారు. మధ్యలో 1984 ఎన్నికల్లో ప్రస్తుత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. జులై 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008 వరకు 40 ఏళ్లు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ-1 ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, యూపీఏ ప్రభుత్వం చేసుకున్న భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అనూహ్యంగా 2008లో సీపీఎం మద్దతు ఉపసంహరించింది. కానీ, సోమ్‌నాథ్ లోక్‌సభ స్పీకర్‌ పదవి నుంచి తప్పుకోడానికి సనేమిరా అనడంతో ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.