యాప్నగరం

ముర్ము రాజీనామాకు ఆమోదం.. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దుచేసిన కేంద్రం.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ముర్మును నియమించింది.

Samayam Telugu 6 Aug 2020, 10:34 am
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా మనోజ్ సిన్హా‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు గురువారం జారీచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను ఆమోదించినట్టు ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ నియామకంపై అధికారిక ఉత్తర్వులను రాష్ట్రపతి ప్రెస్ సెక్రెటరీ అజయ్ కుమార్ వెలువరించింది. మనోజ్ సిన్హా‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం వేశారని, ముర్ము స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు.
Samayam Telugu మనోజ్ సిన్హా
Manoj Sinha, former Union minister


తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మోహన్‌పురలోని మూరమూల గ్రామంలో మనోజ్ సిన్హా 1959 జులై 1న జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్ధి సంఘం నేతగా ఆయన రాజకీయ జీవితం 1982లో ప్రారంభమయ్యింది. అనంతరం బీజేపీలో చేరారు. 1989 నుంచి 96 వరు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తొలిసారి 1996 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 1999లోనూ విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, తర్వాత సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా పనిచేశారు.

జ‌మ్మూ క‌శ్మీర్ తొలి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో మనోజ్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) రాజీవ్‌ మెహెర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలోకి ముర్మును తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే ముర్ము తన పదవికి రాజీనామా చేశారు. ముర్ము రాజీనామాను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన తర్వాత అక్టోబర్ 31, 2019లో ఆ రాష్ట్ర తొలి గవర్నర్ గా ముర్ము నియ‌మి‌తు‌ల‌య్యారు. ముర్ము గుజరాత్ కేడర్‌లోని 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా ముర్ము ప‌నిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.