యాప్నగరం

కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ ఇకలేరు

కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్‌ ఝా ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

TNN 15 Jan 2018, 9:34 am
కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్‌ ఝా ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ల రఘునాథ్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిహార్‌‌కు చెందిన రఘునాథ్‌ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల తరఫున ఆర్జేడీ తరపున పని చేశారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి పీఠం కోసం తుది వరకూ పోటీ పడ్డారు. కానీ కొద్దిలో అవకాశం చేజారడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఎన్నికయ్యారు.
Samayam Telugu former union minister raghunath jha no more
కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ ఇకలేరు


1960లో రాజకీయాల్లో అడుగుపెట్టిన రఘునాథ్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 14వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. బిహార్‌‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికైన తొలి ఎమ్మెల్యే రఘునాథ్ కావడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.