యాప్నగరం

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

Janata Dal United: కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె సుభాషిణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బీహార్‌తో పాటు జాతీయ రాజకీయాల్లో శరద్ యాదవ్ కీలకంగా పాత్ర పోషించారు. బీహార్‌లో అధికార పార్టీ జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. నితీష్ కుమార్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించారు. అనంతరం ఆ పార్టీని లాలూ ప్రసాద్ యాదవ్ ‘ఆర్జేడీ’లో విలీనం చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 12 Jan 2023, 11:47 pm
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి గురువారం (జనవరి 12) రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. ‘పాపా నహీ రహే: (నాన్న ఇక లేరు)’ అని ఆమె పోస్టు పెట్టారు. ఏడుస్తున్న ఎమోజీని జోడించారు. బీహార్‌తో పాటు జాతీయ రాజకీయాల్లో శరద్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు. బీహార్‌లో ప్రస్తుత అధికార పార్టీ జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు.
Samayam Telugu sharad yadav
శరద్ యాదవ్ (ఫైల్ ఫోటో)


జేడీయూ తరఫున శరద్ యాదవ్ 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా, 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. సీఎం నితీష్ కుమార్‌ 2018లో మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు కలపడంతో.. ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకు వచ్చారు శరద్ యాదవ్. 2018లో ‘లోక్ తాంత్రిక్ జనతాదళ్’ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. రెండేళ్ల తర్వాత ఆ పార్టీని లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) పార్టీలో విలీనం చేశారు. ‘విపక్షాల ఐక్యత దిశగా ఇది తొలి అడుగు’ అని నాడు ఆయన ప్రకటించారు.

శరద్ యాదవ్ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. శరద్ యాదవ్ అస్తమయంతో బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లైంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.