యాప్నగరం

మళ్లీ బెంచ్ ఎక్కిన ఆ నలుగురు జడ్జీలు

శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన ఈ నలుగురు జడ్జీలు వారాంతపు సెలవులు పూర్తి కాగానే మళ్లీ బెంచ్ ఎక్కి కేసులు విచారణ ప్రారంభించారు. తాము పూరించిన నిరసన శంఖాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినా మళ్లీ ఎప్పుడు ఎక్కుపెట్టేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

TNN 15 Jan 2018, 12:13 pm
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రపై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆ నలుగురు జడ్జీలు తిరిగి తమ విధుల్లోకి చేరారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ దుమ్మరేపిన జస్టిస్ చలమేశ్వర్ రావు, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ సోమవారం ఉదయం పది గంటలకు తిరిగి విధులకు హాజరై కేసుల విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన ఈ నలుగురు జడ్జీలు వారాంతపు సెలవులు పూర్తి కాగానే మళ్లీ బెంచ్ ఎక్కి కేసులు విచారణ ప్రారంభించారు. తాము పూరించిన నిరసన శంఖాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినా మళ్లీ ఎప్పుడు ఎక్కుపెట్టేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Samayam Telugu four rebelling sc judges back to routine work in court
మళ్లీ బెంచ్ ఎక్కిన ఆ నలుగురు జడ్జీలు


అయితే కొంత మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆ నలుగురికే మద్ధతు ఇస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ అంశం మరింత హాట్ టాపిక్ కాబోతోందని తేలిపోయింది. అయితే అటు సుప్రీంకోర్టు బెంచ్ కు ఇటు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం వహించే " బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా " కూడా పెద్దగా పెదవి విప్పడం లేదు. ఇది న్యాయవ్యవస్థ అంతర్గత సమస్యని త్వరలోనే అంతా సర్దుకుంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే గతంలో పలు సంచలనాత్మక కేసులతో పతాకశీర్షికలకు ఎక్కిన సుబ్రమణ్యస్వామి మాత్రం తప్పంతా ఆ నలుగురు న్యాయమూర్తులదే అని తేల్చిపారేశారు. కేసుల కేటాయింపుల్లో ప్రధాన న్యాయమూుర్తి వివక్ష పాటిస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. న్యాయమూర్తుల దృష్టిలో కేసులున్ని ఒకటే అయినప్పుడు ప్రధానమైన కేసులని, అప్రధానమైన కేసులను ఎలా విడగొడతారని చురక అంటించారు. ఆ దృష్టితో చూడడం సరికాదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.