యాప్నగరం

దేశచరిత్రలో తొలిసారి.. సుప్రీం జడ్జిల మీడియా సమావేశం

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

TNN 12 Jan 2018, 12:56 pm
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సుప్రీంలో రెండో సీనియర్ జడ్జిగా కొనసాగుతోన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ మీడియా సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్‌తోపాటు జస్టిస్ లోకుర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా సుప్రీం కోర్టులో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని కోరినా ఫలితం లేదన్నారు. సుప్రీం అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేదని జాస్తి చలమేశ్వర్ తెలిపారు.
Samayam Telugu four sc judges address media raise alarm over administration under cji dipak misra
దేశచరిత్రలో తొలిసారి.. సుప్రీం జడ్జిల మీడియా సమావేశం


సుప్రీం వ్యవహారాలు సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని మేం కోరాం. కానీ మేం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అభిశంసన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఆ విషయంలో దేశం నిర్ణయం తీసుకోవాలన్నారు.

Supreme Court Judges Kurian Joseph, J.Chelameswar, Ranjan Gogoi and Madan Lokur to address the media shortly #Delhi (names in order of seating) pic.twitter.com/hzONls1b4I — ANI (@ANI) January 12, 2018
దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. నిష్పక్షపాతమైన న్యాయమూర్తి, న్యాయవ్యవస్థ ఉండాలని మేం అభిప్రాయపడుతున్నామని జాస్తి చలమేశ్వర్ తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన తప్పుల్ని సరిదిద్దుకోవాలని నలుగురు జడ్జిలు సూచించారు. జడ్జి లోయా మరణం కేసును సీజేఐ వేరే బెంచ్‌కు మారడం కూడా వివాదానికి కారణమని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.